News March 4, 2025
వికారాబాద్: పరీక్షలకు సర్వం సిద్ధం: శంకర్ నాయక్

జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు నోడల్ అధికారితో కలిసి పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8:45లోగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు చేరుకోవాలని 9:05 నిమిషాల వరకు అనుమతి ఇస్తారన్నారు.
Similar News
News March 15, 2026
పులిని పట్టుకునేందుకు ‘హనుమాన్’ బృందాలు: డిప్యూటీ సీఎం ఆదేశం

జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులిని పట్టుకునేందుకు 10 హనుమాన్ బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆదివారం అధికారులతో మాట్లాడిన ఆయన, కూర్మాపురం తరహాలోనే పులిని బంధించి విశాఖ జూకు తరలించాలని సూచించారు. ఈ ఆపరేషన్ పర్యవేక్షణ బాధ్యతను సీసీఎఫ్ చలపతిరావుకు అప్పగించారు. పులి భయం లేకుండా ప్రజలకు భద్రత కల్పించాలని అటవీ శాఖను ఆదేశించారు.
News March 15, 2026
ప.గో జిల్లాలో అక్షరాంధ్ర పరీక్షకు 99.9 శాతం హాజరు

జిల్లాలో అక్షరాంధ్ర లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తం 60,865 మంది అభ్యర్థులకు గాను 60,829 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను నూరు శాతం అక్షరాస్యత దిశగా తీర్చిదిద్దేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
News March 15, 2026
అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.


