News March 31, 2025
వికారాబాద్: పవిత్రమైన పండుగ రంజాన్: మాజీ ఎమ్మెల్యే

వికారాబాద్ పట్టణ పరిధిలోని ఆలంపల్లిలో గల ఆలం షాహి దర్గా వద్ద రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులను BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి జీవితాలలో కొత్త వెలుగును నింపి, కుటుంబంలో శాంతిని తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
YELLOW ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎండలతో పాటు అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD వెల్లడించింది. APలో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు, ఉ.గో, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. TGలో ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, HYD, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News April 20, 2025
చేగుంట: అడవి పంది ఢీకొని ఒకరి మృతి

చేగుంట మండలం పోలంపల్లి గ్రామ శివారులో బైక్‌ను అడవి పంది ఢీకొట్టడంతో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న రాత్రి కొండాపూర్ గ్రామానికి చెందిన బొంది భాను(18), తుమ్మల కనకరాజు(27) బైక్ పై రాజుపల్లి నుంచి కొండాపూర్‌కు వెళ్తున్నారు. పోలంపల్లి శివారులో అడవి పంది అడ్డు రావడంతో ఢీకొట్టి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన భాను చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు.
News April 20, 2025
GOVT ఉద్యోగాల్లో వారికి 3% రిజర్వేషన్లు

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్‌ను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పతకాలు సాధిస్తే పోటీ పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇవ్వనుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు, DSC, యూనిఫాం శాఖలకూ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. గతంలో ఉన్న పదేళ్ల కాలపరిమితిని ఎత్తేసింది. అర్హత, వయసు ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పతకాలు సాధించిన వారంతా అర్హులే.