News February 26, 2025
వికారాబాద్: పహాని స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

పహాని స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులతో రెవెన్యూ సమస్యలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2020-25 మధ్య సంవత్సరంలో ఉన్న ప్రతి పహానిని గ్రామాల వారీగా పూర్తి సర్వే నిర్వహించాలన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలన్నారు.
Similar News
News October 25, 2025
నిజామాబాద్: ‘పెన్షన్ ఇప్పించండి’

NZB జిల్లాలోని 2003 DSC ఉపాధ్యాయులు తమకు పెన్షన్ ఇప్పించాలని MLC శ్రీపాల్ రెడ్డిని కోరారు. PRTU జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు MLCని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ.. పెన్షన్ ఇప్పించడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బాధ్యులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News October 25, 2025
ఏలేరు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

ఏలేరు ప్రాజెక్ట్ నుంచి మూడు వేల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ శనివారం ప్రకటించారు. ప్రజలు ముంపునకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 25, 2025
చీర కట్టుకుంటున్నారా..? ఇలా చేస్తే సూపర్ లుక్

ఎంత ట్రెండీ, ఫ్యాషన్ డ్రెస్సులున్నా ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చీరకే ఓటేస్తారు. అయితే చీర కట్టడంలో కొన్ని టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోతుంది. చీర ఎంత ఖరీదైనా అది మనకు నప్పకపోతే బావుండదు. కాబట్టి మీ ఒంటికి నప్పే రంగు ఎంచుకోవాలి. లైట్ కలర్ చీరైతే మంచి ప్రింట్స్ ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ వేసుకోవాలి. అప్పుడప్పుడూ డిఫరెంట్గా చీర కట్టడం ట్రై చేయాలి. చీరను బట్టి జ్యువెలరీ ఎంచుకోవాలి.


