News February 14, 2026

వికారాబాద్ పురపోరులో కారుకు బ్రేకులు..!

image

వికారాబాద్ జిల్లా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పరాజయంపై కేడర్ భగ్గుమంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వపై ఉన్న వ్యతిరేకతను వాడుకోవడంలో జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెతుకు ఆనంద్ తన భార్యను పోటీలో ఉంచినా.. వికారాబాద్ దక్కేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి వంటి నేతలు కష్టపడినా ఫలితం దక్కలేదు.

Similar News

News March 12, 2026

ఆదిలాబాద్‌: ఘనంగా ధర్మగురువు హీరా సుక్క జయంతి

image

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 15న గోండి ధర్మగురువు హీరా సుక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రధాన్‌ కులస్తులు భారీగా తరలిరానున్నారు. వేడుకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు.

News March 12, 2026

PHOTO: నాగచైతన్య సిక్స్‌ప్యాక్‌

image

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో ‘అర్జున్’ అనే పవర్‌ఫుల్ పాత్ర కోసం చైతూ తన బాడీని పూర్తిగా మార్చేశారు. తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న షర్ట్‌లెస్ ఫొటో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో హారర్, మైథలాజికల్ అంశాలతో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. ‘చైతూ పడ్డ కష్టానికి ఈ సారి హిట్ పక్కా’ అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

News March 12, 2026

దేవరపల్లి: లారీ ఢీకొని రిటైర్డ్ వ్యవసాయాధికారి మృతి

image

దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాంధీనగరం గ్రామానికి చెందిన రిటైర్డ్ వ్యవసాయ శాఖ AD ఆచంట జగన్నాథరావు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గాంధీనగరంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.