News January 25, 2025
వికారాబాద్: పోలీసులకు ఆటంకం.. 14 రోజులు రిమాండ్: ఎస్పీ

పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారికీ 14 రోజుల రిమాండ్ విధించినట్లు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. తాండూర్ పీఎస్ పరిధిలో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిని రిమాండ్‌కు పంపామన్నారు. ఈ నెల 23న తాండూర్ పట్టణంలోని విలియం మున్స్ గ్రౌండ్లో గొడవ జరుగుతుందని 100కు కాల్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు.
Similar News
News February 18, 2025
HYD: హైడ్రాకు 64 ఫిర్యాదులు: కమిషనర్

HYDలోని బుద్ధభవన్‌లో ఈరోజు హైడ్రా ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 64 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. తమ కాలనీలకు వెళ్లేందుకు వీలు లేకుండా కొంతమంది కాలనీవాసులు చుట్టూ ప్రహరీలు నిర్మించుకుంటున్నారని, నాళాలు కబ్జా చేసి వరద నీరు వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.
News February 18, 2025
వ్యాయామం చేయకుండానే ఫిట్‌గా ఉండాలా?

కసరత్తులతో చెమటలు చిందించకుండానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, సీడ్స్, ప్రోటీన్ పదార్థాలు తినాలి. షుగర్, ఫ్రై, ప్రాసెస్‌డ్ ఫుడ్ తినకూడదు. అలాగే లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, పార్కులో నడవడం వల్ల కేలరీలు కరిగి శరీరం ఫిట్‌గా మారుతుంది. తగినన్ని నీళ్లు తాగి, తగినంత నిద్ర పోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
News February 18, 2025
మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

11వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ బాయ్స్, గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలకు హవేలి ఘనపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం కరుణాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన నవీన్, ప్రకాష్ సింగ్, రోహిత్ గౌడ్‌లు రన్నింగ్, షాట్ ఫుట్ విభాగాల్లో ఎంపికయ్యారని అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నేడు మంగళవారం జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను అభినందించారు.