News April 7, 2025
వికారాబాద్: ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్లు లింగయ్య నాయక్, సుదీర్లతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీపీఓ జయసుధ, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఓ రేణుకాదేవి, సాంఘీక సంక్షేమ అధికారి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 17, 2025
ABCD అవార్డు అందుకున్న విజయనగరం ఎస్పీ

మంగళగిరిలోని డీజీపీ హరీష్ గుప్తా చేతుల మీదుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం ABCD అవార్డును అందుకున్నారు. ఇటీవల విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిజిటల్ అరెస్టు కేసును ఛేదించినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ ABCD అవార్డును స్వీకరించారు. అనంతరం ఎస్పీను డీజీపీ హరీష్ గుప్తా అభినందించారు.
News April 17, 2025
నేటి ముఖ్యాంశాలు

* TG: జపాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
* కాంగ్రెస్ కుంభకోణాల్ని ప్రజలు మర్చిపోలేదు: కిషన్ రెడ్డి
* కంచ భూములపై స్టేటస్ కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు
* ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాం: కేటీఆర్
* ఏపీకి అండగా ఉండాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు
* రూ. 4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం
* సూపర్ ఓవర్లో RRపై DC విజయం
News April 17, 2025
సూపర్ ఓవర్.. DC టార్గెట్ ఎంతంటే?

IPL-2025: ఈ ఏడాది జరిగిన తొలి సూపర్ ఓవర్లో RR 11 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, జైస్వాల్ రనౌట్ అయ్యారు. 20వ ఓవర్ అద్భుతంగా వేసి మ్యాచ్ను టై చేసిన స్టార్క్ సూపర్ ఓవర్లో బౌలింగ్ చేశారు. DC లక్ష్యం 12 పరుగులు. హెట్మెయర్ 5, పరాగ్ 4 రన్స్ చేయగా.. ఎక్స్ట్రాల ద్వారా 2 పరుగులు వచ్చాయి.