News April 7, 2025

వికారాబాద్: ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్లు లింగయ్య నాయక్, సుదీర్‌లతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీపీఓ జయసుధ, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఓ రేణుకాదేవి, సాంఘీక సంక్షేమ అధికారి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 23, 2025

9 నుంచి 27 ర్యాంక్‌కు పడిపోయిన ADB జిల్లా

image

ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ADB జిల్లాలో ఫస్టియర్ 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 8,890కి 6,291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం ఫస్టియర్‌లో 54.55, సెకండియర్‌లో 70.76గా నమోదైంది. ఫస్టియర్‌లో రాష్ట్రంలో జిల్లా గతేడాది 9వ స్థానంలో ఉండగా.. ఈసారి 27వ స్థానంలో నిలిచింది. సెకండియర్ గతేడాది 13వ ప్లేస్‌లో ఉండగా ఈసారి 12వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

దూబే మంచి మనసు.. 10 మందికి ఆర్థిక సాయం

image

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. రూ.70వేల చొప్పున పది మందికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. క్రీడల్లో రాణించాలంటే అధునాతన కిట్స్, నాణ్యమైన కోచింగ్ అవసరమని, అందుకే తన వంతు సాయం చేస్తున్నానని ఆయన తెలిపారు. TT, ఆర్చరీ, పారా అథ్లెటిక్స్, చెస్, క్రికెట్ తదితర రంగాల్లోని క్రీడాకారులకు ఈ డబ్బు అందనుంది.

News April 23, 2025

సివిల్స్‌లో వెల్దండ యశ్వంత్‌కు 432వ ర్యాంకు

image

వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించాడు. గత సంవత్సరం సివిల్స్ రాయగా 627వ ర్యాంకు సాధించిన యశ్వంత్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. తిరిగి పరీక్ష రాయగా ఈసారి మంచి ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు ఉమాపతి నాయక్, పద్మ సంతోషం వ్యక్తం చేశారు. యశ్వంత్‌ను కుటంబీకులు, మిత్రులు అభినందించారు. 

error: Content is protected !!