News February 20, 2025
వికారాబాద్: ప్రతి ఒక్కరూ బాలికల విద్యకు ప్రోత్సహించాలి: ట్రైనీ కలెక్టర్

బాలికల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శిశు సంక్షేమ శాఖ ఇంఛార్జ్ అధికారి ట్రైన్ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. బుధవారం వికారాబాద్ కేజీబీవీ పాఠశాలలో బేటి బచావో బేటి పఢావో కార్యక్రమం 10ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వారి విద్యకు, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు.
Similar News
News March 28, 2025
ఆసుపత్రిలో చేరిన కింగ్ ఛార్లెస్-3

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 76ఏళ్ల ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అందుకు చికిత్స తీసుకుంటుండగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌తో హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం కింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని లండన్‌లోని బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటన్ కింగ్‌గా అవతరించిన ఛార్లెస్‌కు 2024 ఫిబ్రవరిలో క్యాన్సర్ నిర్ధారణ అయింది.
News March 28, 2025
నేషనల్ సైకిలింగ్ పోటీలకు సిద్దిపేట విద్యార్థి

9వ జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీలకు సిద్ధిపేటకు చెందిన బూక్య ప్రసాద్ ఎంపికైనట్లు జిల్లా సైకిల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులు బండారుపల్లి శ్రీనివాసులు, జంగపల్లి వెంకట నర్సయ్య తెలిపారు. ఈనెల 7,8,9న రంగారెడ్ది జిల్లాలో జరిగిన పోటిల్లో సత్తా చాటిన ప్రసాద్.. హరియాణాలోని పంచకులలో ఈనెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.
News March 28, 2025
భద్రాచలంకు రూ.35 కోట్లు.. సీఎంకు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.