News February 1, 2025
వికారాబాద్: ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
జిల్లాలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనేందుకు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు అధికారులు వేసవి నీటి కరువు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 1, 2025
వికారాబాద్: అడవిలో ఉద్దేశపూర్వకంగా నిప్పు పెడితే చర్యలు
అటవీ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ రేంజర్ అధికారి రాజేందర్ హెచ్చరించారు.శుక్రవారం అర్ధరాత్రి యాలాల్ మండలం రాస్నం-అంపల్లి మార్గంలో గల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సెక్షన్ అధికారి కనకరాజు తన సిబ్బందితో వెళ్లి మంటలు ఆర్పారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగితే అటవీ భూములు సాగు చేస్తున్న రైతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 1, 2025
బిహార్కు వరాల జల్లు
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్కు కేంద్రం బడ్జెట్లో పెద్ద పీట వేసింది.
*బిహార్ కేంద్రంగా మఖానా బోర్డు ఏర్పాటు
*బిహార్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు
*నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు
*పట్నా విమానాశ్రయం విస్తరణ
*బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు
News February 1, 2025
ఫుట్వేర్ సెక్టార్కు కొత్త స్కీమ్.. 22 లక్షల మందికి ఉపాధి
ఫుట్వేర్, లెదర్ సెక్టార్లో ఉత్పత్తి, నాణ్యతను మెరుగుపరించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాణ్యమైన లెదర్, నాన్ లెదర్ పాద రక్షల ఉత్పత్తి, డిజైన్, యంత్రాలకు మద్దతునివ్వడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్తగా 22 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రూ.1.1 లక్షల కోట్ల ఎగుమతులు సాధిస్తుందని చెప్పారు.