News February 1, 2025

వికారాబాద్: ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ 

image

జిల్లాలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వ్యాప్తంగా రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనేందుకు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు అధికారులు వేసవి నీటి కరువు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. 

Similar News

News March 11, 2026

‘కరోనా’కు ఆరేళ్లు

image

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన కరోనాను WHO ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఆరేళ్లు. చైనాలో మొదలైన ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. వైద్యులు, శాస్త్రవేత్తల కృషితో వచ్చిన టీకాలు వైరస్ కట్టడికి దోహదపడ్డాయి. రోజులు గడిచిపోతున్నా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీ కామెంట్?

News March 11, 2026

నెల్లూరు: నారా లోకేశ్ పర్యటనలో మార్పులు

image

మంత్రి నారా లోకేశ్ ఈనెల 12న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 12:45 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు బోగోలు మండలం జువ్వలదిన్నెకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు జువ్వలదిన్నె వద్ద జరిగే సాగర్ డిఫెన్స్ ఫౌండేషన్ స్టోన్ ఫౌండేషన్‌లో పాల్గొంటారు.

News March 11, 2026

ఫిరాయింపు MLA కేసులో క్లీన్ చిట్.. KTR ఫైర్

image

TG: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ <<19352106>>క్లీన్ చిట్<<>> ఇవ్వడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. ‘కాంగ్రెస్ బీఫామ్‌పై MPగా పోటీ చేసిన వారికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే. అధికార పార్టీ కోసం రాజ్యాంగ వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు’ అని KTR హెచ్చరించారు.