News April 8, 2025
వికారాబాద్: ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలి’

ఎస్సీ, ఎస్టీ బాలికలను కులం పేరుతో దూషించి దాడి చేసిన వికారాబాద్ జిల్లా కొత్త గడి సొషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సాయిలతను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్, మానవహక్కుల వేదిక, ఎంవీ ఫౌండేషన్ సంస్థలు వినతిపత్రం అందజేశాయి.
Similar News
News November 7, 2025
గద్వాల: విషాదం.. హాస్టల్లో విద్యార్థి SUICIDE

HYD తెలుగు విశ్వవిద్యాలయం వసతిగృహంలో విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన పద్మ కుమారుడు పరశురాం(20) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం హాస్టల్ గది తలుపు తెరవకపోవడంతో సిబ్బంది బద్దలుకొట్టి చూడగా, పరశురాం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News November 7, 2025
ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిందే: సుప్రీం

కారణాలు చెప్పకుండా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎందుకు అరెస్టు చేశారు? FIRలో ఏం రాశారు? ఏ చట్టాలను ప్రస్తావించారో నిందితులకు చెప్పాలని తేల్చి చెప్పింది. ‘అరెస్టుకు ముందు లేదా అరెస్టయిన తక్షణమే కారణాలు చెప్పాలి. 2 గంటల్లోపే మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగలిగితే ఇది వర్తించదు’ అని తెలిపింది. తన అరెస్టుకు కారణాలు చెప్పలేదంటూ మిహిర్ రాజేశ్(ముంబై) వేసిన కేసులో ఈ తీర్పు వెల్లడించింది.
News November 7, 2025
పిల్లల విక్రయం? పెళ్లి కాకుండానే మహిళ ప్రసవాలు!

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఓ అవివాహిత గురువారం ఇంట్లో బిడ్డకు జన్మనిచ్చారు. శిశువుకు హెల్త్ బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతంలోనూ ఆమెకు రెండు ప్రసవాలు జరిగినట్లు గుర్తించిన సిబ్బంది కంగుతిన్నారు. బిడ్డలను కని, విక్రయించడమే వారి వ్యాపారమని స్థానికులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది శిశువును నంద్యాలలోని కేర్ సెంటర్‌కు తరలించారు.


