News April 8, 2025
వికారాబాద్: ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలి’

ఎస్సీ, ఎస్టీ బాలికలను కులం పేరుతో దూషించి దాడి చేసిన వికారాబాద్ జిల్లా కొత్త గడి సొషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సాయిలతను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్, మానవహక్కుల వేదిక, ఎంవీ ఫౌండేషన్ సంస్థలు వినతిపత్రం అందజేశాయి.
Similar News
News July 9, 2025
రేపు జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలను రేపు కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.లక్ష్మణ్ దేవ్ ప్రకటించారు. ఆండర్-13, 14 విభాగాల్లో సత్తాచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. 2011-12 సంవత్సరాల మధ్య జన్మించిన క్రీడాకారులు పోటీలకు అర్హులని తెలిపారు.
News July 9, 2025
ఆ రోజు ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయవద్దు: డీఈఓ

ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు సూచించారు. తల్లిదండ్రులకు విద్యార్థుల ద్వారా ముందస్తు సమాచారం అందించాలన్నారు. సమావేశం నిర్వహించే రోజు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కచ్చితంగా హాజరవ్వాలన్నారు. తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించే రోజు ఎవరికీ సెలవు మంజూరు చేయవద్దని తెలిపారు.
News July 9, 2025
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమైన ఆ ఫ్లైట్‌ను తిరిగి పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.