News March 19, 2025
వికారాబాద్: బీజేపీలో అంతర్గత కుమ్ములాట

ఊహించని విధంగా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా స్థానికేతరుడైన డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డిని నియమించడంతో వికారాబాద్ జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. నామినేషన్ తిరస్కరించాలని సంబంధిత పరిశీలకునికి వినతి పత్రం సమర్పించిన రోజే జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని నియమించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు హైదరాబాద్కు వెళ్లనున్నారు.
Similar News
News November 20, 2025
పాలకుర్తి సభను విజయవంతం చేయండి: TRP

ఈనెల 25న పాలకుర్తిలో జరిగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభను విజయవంతం చేయాలని జనగామ జిల్లా అధ్యక్షురాలు చెరుకూరి మౌనిక యాదవ్ కోరారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25న పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరవుతున్నారని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News November 20, 2025
మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
News November 20, 2025
భద్రాచలం: నెల రోజుల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో డిసెంబరు 20 నుంచి జనవరి 9 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబరు 29న స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. అత్యంత ప్రసిద్ధి గాంచిన ఈ వేడుకల్లో భాగంగా డిసెంబరు 30న ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం పూజలు జరగనున్నాయి.


