News April 4, 2025
వికారాబాద్: భార్యను తిట్టాడని కొట్టి చంపాడు!

తన భార్యను అసభ్యంగా తిడుతున్నాడని కోపోద్రిక్తుడైన వ్యక్తి కర్రతో చితకబాదడంతో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్ఐ అరవింద్ వివరాలు.. మోమిన్‌పేట్ మం. ఏన్కతలలో కిష్టయ్య (75) వికలాంగ వృద్ధుడు. తన ఇంటి పక్క మహిళను అసభ్యంగా తిడుతున్నాడని ఆమె భర్త కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో చనిపోయాడని కిష్టయ్య పెద్ద కుమారుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అరవింద్ వెల్లడించారు.
Similar News
News April 19, 2025
మరోసారి థియేటర్లలోకి ‘బాషా’

రజినీకాంత్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటైనా ‘బాషా’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 25న రీరిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రజిని స్వాగ్, స్టైల్‌ను థియేటర్లలో చూసేందుకు సిద్ధమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న చాలా చిత్రాలకు ‘బాషా’ స్క్రీన్ ప్లేను రిఫరెన్స్‌గా వాడతారని సినీ విశ్లేషకులు చెబుతారు.
News April 19, 2025
హెరాల్డ్ కేసులో మేం భయపడేది లేదు: ఖర్గే

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై పెట్టిన కేసులకు తాము భయపడేది లేదని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకే వారిని ఈ కేసులో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలో సుప్రీం కోర్టు తమ పార్టీ లేవనెత్తిన కీలక పాయింట్లకు ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాలని ఖర్గే పిలుపునిచ్చారు.
News April 19, 2025
పెనుకొండలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చసుకొంది. ప్రమాదంలో కారు, బైకు ఢీకొనడంతో ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు వారు వివరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.