News February 5, 2025
వికారాబాద్: భూ సమస్యలపై అవగాహన కల్పించుకోవాలి: కలెక్టర్

భూసమస్యలతో పాటు ఇతర సమస్యలపై అవగాహన పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతనంగా విధుల్లో చేరిన 34 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై అవగాహన కల్పించుకొని పరిణతితో ప్రజలకు చక్కగా సేవలందించాలన్నారు.
Similar News
News January 25, 2026
KNR: పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.. ఆదమరిస్తే అంతే!

ఉమ్మడి KNR జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి, మానేరు నది తీరాన పురాతన శిథిలావస్థలోని ఆలయాలు, రామగిరి ఖిల్లా, ధూళికట్ట బౌద్ధక్షేత్రంతో పాటు జలాశయాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేలా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ప్రాంతంలోని పురాతన దేవాలయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి.
News January 25, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. అటు పలు చోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది.
News January 25, 2026
ఖమ్మం: వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పోటీకి సై..!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి సాగేందుకు సీపీఐ పావులు కదుపుతోంది. వైరా(2), మధిర(3), ఇల్లందు(3), అశ్వారావుపేట(3), సత్తుపల్లి(1) వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్ధమని వామపక్ష నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తే.. ఉమ్మడి జిల్లాలో ‘హస్తం-ఎర్రజెండా’ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది.


