News January 29, 2025

వికారాబాద్: మండలాల వారీగా రైతు భరోసా జమ (2)

image

మోమిన్‌పేట్ మం. బాల్రెడ్డి గూడలో రైతు భరోసా 472, ఆత్మీయ భరోసా 14, బషీరాబాద్, కిస్మాపూర్ 419, ఆత్మీయ భరోసా 29, యాలాల్, తిమ్మాయిపల్లి, 565, ఆత్మీయ భరోసా 40, దౌల్తాబాద్, నందారం 374, ఆత్మీయ భరోసా 11, దుద్యాల, సంగిపల్లి 824, ఆత్మీయ భరోసా 07, కోట్‌పల్లి, కంకణాలపల్లి, 322, ఆత్మీయ భరోసా 57, మర్పల్లి, గండ్లమర్పల్లి 363, ఆత్మీయ భరోసా 29 మంది రైతుల ఖాతాలో జమ చేసినట్టు అధికారులు తెలిపారు.

Similar News

News September 18, 2025

పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

image

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News September 18, 2025

జీకేవీధి: పాము కాటుకు గురై బాలిక మృతి

image

గూడెం కొత్తవీధిలోని బొంతువలసకు చెందిన మర్రి కవిత (9) పాము కాటుకు గురై మృతి చెందింది. ఇంట్లో పడుకున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తల్లిదండ్రులు పెద్దవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 18, 2025

రేపు కాకతీయ యూనివర్సిటీలో జాబ్ మేళా..!

image

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ డా.రహమాన్ పాల్గొన్నారు.