News January 29, 2025
వికారాబాద్: మండలాల వారీగా రైతు భరోసా జమ (2)

మోమిన్‌పేట్ మం. బాల్రెడ్డి గూడలో రైతు భరోసా 472, ఆత్మీయ భరోసా 14, బషీరాబాద్, కిస్మాపూర్ 419, ఆత్మీయ భరోసా 29, యాలాల్, తిమ్మాయిపల్లి, 565, ఆత్మీయ భరోసా 40, దౌల్తాబాద్, నందారం 374, ఆత్మీయ భరోసా 11, దుద్యాల, సంగిపల్లి 824, ఆత్మీయ భరోసా 07, కోట్‌పల్లి, కంకణాలపల్లి, 322, ఆత్మీయ భరోసా 57, మర్పల్లి, గండ్లమర్పల్లి 363, ఆత్మీయ భరోసా 29 మంది రైతుల ఖాతాలో జమ చేసినట్టు అధికారులు తెలిపారు.
Similar News
News February 10, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

మలయాళ నటుడు అజిత్ విజయన్(57) కన్నుమూశారు. తన నివాసంలో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒరు ఇండియన్ ప్రణయకథ, బెంగళూరు డేస్, అమర్ అక్బర్ అంథోని, అంజు సుందరికల్ తదితర సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతిపై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
News February 10, 2025
ఇండియా కూటమిలో ఉండాలా వద్దా: ఆప్ సందిగ్ధం

ఢిల్లీ ఓటమితో ఆమ్‌ఆద్మీ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఒకవైపు పంజాబ్‌లో పార్టీ చీలిపోతుందేమోనని భయం. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, అవధ్ ఓజా, సత్యేందర్ జైన్ అడుగుపెట్టలేని పరిస్థితి. పార్టీని ఆతిశీ టేకోవర్ చేస్తారేమోనన్న ఆందోళన. వీటన్నిటి నడుమ ఇండియా కూటమిలో కొనసాగాలో లేదో తేల్చుకోలేని పరిస్థితిలో ఆప్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిని వీడొచ్చని వారి అంచనా.
News February 10, 2025
YCPలోకి నగరి MLA సోదరుడు..?

నగరి MLA గాలి భానుప్రకాశ్ సోదరుడు జగదీశ్ YCPలో చేరుతారని సమాచారం. ఆయన తండ్రి ముద్దుకృష్ణమ నాయుడు 2019లో మృతిచెందారు. రాజకీయ వారసుడి విషయంలో అప్పట్లో సందిగ్ధం నెలకొంది. దీంతో చంద్రబాబు ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి MLC ఇచ్చారు. 2019, 24లో భాను ప్రకాశ్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి జగదీశ్ తటస్థంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఈనెల 12న ఫ్యాన్ గూటికి చేరుతారని సమాచారం.