News February 13, 2025
వికారాబాద్: మరోసారి కనిపించిన చిరుత (UPDATE)

వికారాబాద్ అనంతగిరి అడవుల్లో కనిపించిన చిరుత మదనపల్లి బీరోల్ గ్రామ సరిహద్దుల్లో మరోసారి కంటపడింది. బీరోల్ గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ అటుగా వెళుతుండగా చిరుత రోడ్డు దాటుతూ కనిపించిందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత జాడ కోసం సెక్షన్ ఆఫీసర్ అరుణ అన్వేషిస్తున్నారు.
Similar News
News February 19, 2025
నేడు బీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్

TG: గులాబీ బాస్ కేసీఆర్ నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్‌కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 19, 2025
టీమ్ ఇండియా ఆ పాక్ ఆటగాడితో జాగ్రత్తగా ఉండాలి: హర్భజన్

పాక్ ఆటగాడు ఫకర్ జమాన్‌తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించారు. ‘భారత్‌పై జమాన్ రికార్డు చాలా బాగుంది. గతంలో మన విజయావకాశాల్ని అతడు దెబ్బకొట్టాడు’ అని గుర్తుచేశారు. భారత్‌పై 6 మ్యాచులాడిన జమాన్ 46.80 సగటుతో 234 రన్స్ చేయడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల సమరం ఈ నెల 23న జరగనుంది.
News February 19, 2025
తిరుపతి జిల్లాలో రిపోర్టర్లు కావలెను

తిరుపతి జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <