News January 28, 2025

వికారాబాద్: మహిళా సంఘాలకు కొత్త లీడర్లు

image

మహిళా సంఘాలకు కొత్త లీడర్లు రానున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు ఇప్పిస్తోంది. కాగా ప్రతి సంఘానికి లీడర్లను సభ్యులు ఎన్నుకుని తమ గ్రూప్‌ను నడిపిస్తారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని మహిళా సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. కొత్త లీడర్లను ఎన్నుకునే ప్రక్రియను చైన్ సిస్టం ద్వారా గ్రామ నుంచి జిల్లా స్థాయి వరకు ఐకేపీ అధికారులు చేపడుతున్నారు.

Similar News

News February 9, 2025

గుంటూరు ప్రజలకు SP సతీశ్ సూచన 

image

గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)ని రద్దు చేయడం జరిగిందని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను తిరిగి ప్రకటిస్తామని చెప్పారు.

News February 9, 2025

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే చెప్పండి: మెదక్ పోలీసులు

image

పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని మెదక్ జిల్లా పోలీసులు సూచించారు. మెదక్ మండల కేంద్రంలోని ఒకటో నంబర్ కల్లు దుకాణంలో మహిళను మభ్యపెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని పరారైన దుండగుడి ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.

News February 9, 2025

ఫ్లడ్ లైట్‌ ఫెయిల్యూర్‌తో నిలిచిన మ్యాచ్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్ సెటైర్లు

image

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ కారణంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఎవరైనా ఎలక్ట్రీషియన్ స్టేడియంలో దగ్గరలో ఉంటే రావాలని ENG ఫ్యాన్స్ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ బోర్డు ఇలాంటి వసతులతో మ్యాచ్ నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ ఆగితే ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టెక్కుతుందని కొందరు భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

error: Content is protected !!