News February 8, 2025
వికారాబాద్: మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్
గ్రామాల్లో మహిళలకు అవగాహన కలిగించి మహిళా స్వయం సహాయక సంఘాలకు బలోపేతం చేసేందుకు సీఅర్‌పీ వ్యూహం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సీఅర్‌పీ మహిళలతో మాట్లాడారు. మహిళా సంఘాల బలోపేతం లక్ష్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగయ్యనాయక్ ఉన్నారు.
Similar News
News February 9, 2025
పార్వతీపురం: జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం
పార్వతీపురం మన్యం జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం ఈనెల 10న చేపడుతున్నట్లు DM&HO డాక్టర్ భాస్కరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3845 అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 55,234 మంది, 5 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 1,41,378 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి మాత్రలు అందేలా చర్య చేపట్టాలని సూచించారు.
News February 9, 2025
రోహిత్ శర్మ రాణించాలని అభిమానుల పూజలు
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫొటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
News February 8, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!
> కుందారంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> ముగ్గురు పిల్లలు ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష
> పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం
> కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరుడు
> టాప్ ర్యాంకే లక్ష్యంగా జిల్లాలో ‘విజయోస్తూ’ కార్యక్రమం
> సేవాలాల్ జయంతికి డీసీపీకి ఆహ్వానం