News March 25, 2025

వికారాబాద్: మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మోమిన్పేట్ మండలం మొరంగపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బైకాని నరేశ్ (24), మంగలి సన్నీ (22) ప్రాణస్నేహితులు. అవసర నిమిత్తం మోమిన్పేట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మొరంగపల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News April 19, 2025

పార్వతీపురం: ‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

image

రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 8,16,859 మంది రేషన్ కార్డులు దారుల్లో 7,49,481 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని తెలిపారు. 5 ఏళ్ల లోపు వారికి అవసరం లేదు అన్నారు. 54,392 మంది రేషన్ కార్డుదారులు సమీప డీలర్ వద్ద గాని, MDU ఆపరేటర్ వద్ద గాని ఈనెల 30 తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు.

News April 19, 2025

హైదరాబాద్: సీఎం పర్మిషన్ కోసం వెయిటింగ్

image

నగరంలో అక్కడక్కడా రోడ్లు దెబ్బతినగా వాటికి మరమ్మతులు చేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆ పనుల కోసం టెండర్లు పిలవాల్సి ఉందంటున్నారు. నగరంలో దాదాపు 744 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులకు రూ.2,491 కోట్లు కావాలని అందుకోసం ఇప్పటికే సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. సీఎం రేవంత్ అనుమతి లభించిన తరువాత పనులు ప్రారంభం అవుతాయని అంటున్నారు. 

News April 19, 2025

సంగారెడ్డి: 25 నుంచి ఉచిత వేసవి శిబిరాలు

image

సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 25 నుంచి జూన్ 5వ తేదీ వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్లు డిఈవో వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. కుట్లు, అల్లికలు సంగీతం, శాస్త్రీయ నృత్యం, చిత్రలేఖనం, స్టోరీ టెల్లింగ్, చదరంగం, టిఎల్ఎం తయారీ, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 9 నుంచి 12:30 గంటల వరకు రోజు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

error: Content is protected !!