News February 6, 2025
వికారాబాద్: లగచర్లలో మరోసారి భూ సర్వే

దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో పారిశ్రామికవాడను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి భూ సర్వేను చేపట్టనున్నట్లు తహశీల్దార్ కిషన్ పేర్కొన్నారు. పులిచెర్లకుంట, రోటిబండ తండా గ్రామాల్లో అసైన్డ్ భూములను సేకరించనున్నామని స్పష్టం చేశారు. కావున ఆయా ప్రాంతాల రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 20, 2025
NLG: బడ్జెట్లో జిల్లాకు పెరిగిన ప్రాధాన్యం

రాష్ట్ర వార్షిక బడ్జెట్లో జిల్లాకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో కాస్త ఎక్కువ నిధులు కేటాయించింది. డిండి ఎత్తిపోతల పథకానికి, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ వంటి ప్రాజెక్టులకు నిధులు పెంచింది. జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రగతి పద్ధతి కింద రూ.1,600 కోట్లు కేటాయించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 20, 2025
NLG: మే నాటికి ఐదు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి: భట్టి

ఈ ఏడాది మే నెల నాటికి ఉమ్మడి జిల్లాలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు.
News March 20, 2025
BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు కేటాయించింది. నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు ఇవ్వగా.. పాలమూరు ప్రాజెక్టుకు రూ.1715కోట్లు దక్కాయి. పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు ఇచ్చింది. బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.