News March 13, 2025
వికారాబాద్: విద్యార్థుల దాతృత్వానికి సలాం..!

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగంకుర్దు గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.22లక్షల అవసరమని ఇటీవల తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న సంగంకుర్దు ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని చిన్నారి వశిష్ట వైద్య చికిత్సకు అందించాలని భావించారు. వారు దాచుకున్న డబ్బులను బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల సాయంతో అందించారు.
Similar News
News November 26, 2025
విశాఖ రివ్యూ మీటింగ్‌లో MLA మద్దిపాటి

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం విశాఖ కలెక్టరేట్‌లో జరిగిన అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుని హోదాలో రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఎస్టిమేట్‌కి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, విశాఖ కలెక్టర్‌తో పాటుగా ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News November 26, 2025
ఏలూరులో మంత్రి మనోహర్ నేతృత్వంలో జిల్లా సమీక్ష

ఏలూరు కలెక్టరేట్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహాల పురోగతి, 22A కేసులు, విశాఖ CII సమ్మిట్ అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ వివిధ శాఖల పురోగతిపై నివేదిక ఇచ్చారు. మంత్రి పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
News November 26, 2025
బెట్టింగ్‌లతో అప్పులు.. గన్ తాకట్టు పెట్టిన ఎస్ఐ!

TG: హైదరాబాద్ అంబర్‌పేట్ SI గన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతోపాటు తన సర్వీస్ గన్‌ను SI భాను ప్రకాశ్ తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేశారని, బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగారం, తుపాకీ తాకట్టు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.


