News February 3, 2025

వికారాబాద్: సమస్యలకు సత్వరం పరిష్కారం: కలెక్టర్ ప్రతీక్

image

శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి 106 ఫిర్యాదులు రావడం జరిగిందని వివిధ శాఖల అధికారులు పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించి ఆర్జీదారులకు న్యాయం చేయాలన్నారు.   

Similar News

News January 11, 2026

మన పల్నాడే పందేం కోళ్లకు అసలైన కేరాఫ్!

image

కోడి పందేలు అనగానే APలోని ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. అయితే కోడి పందేలు చరిత్ర శతాబ్దాల వెనక్కి వెళ్లితే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాటి వీరగాథ ముందుకొస్తుంది. కోడి పందేలే కారణంగా పల్నాడు యుద్ధంలో రక్తపాతం జరిగింది. సామాజిక విభేదాలు, అధికార పోరాటాలు కోడి పందేల చుట్టూ ముదిరి చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడి పందేలు చరిత్రగా, ఒక రకంగా సంప్రదాయంగా ఉన్నాయి.

News January 11, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ‘దిత్వా’

image

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండడంతో.. రైతుల్లో భయందోళన మొదలైంది. జిల్లాలో మిర్చి సుమారు 50వేల ఎకరాలపైగా కాతపూత దశలో ఉంది. మొక్కజొన్న లక్షన్నరపైగా ఎకరాల్లో సాగులో ఉంది. వర్షం పడితే మిర్చి, మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. అటు పండుగ సంబురాలకు కూడా వర్షం ఆటంకం కలిగించనుంది.

News January 11, 2026

కృష్ణా: ‘బరి’తెగించిన వసూళ్లు.. ఒక్కో చోట రూ. 20 లక్షల మామూళ్లు!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందేల నిర్వహణకు తెర వెనుక భారీగా మామూళ్ల పర్వం సాగుతోంది. బరుల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధుల నుంచి పోలీసు అధికారుల వరకు ఒక్కో బరికి సుమారు రూ. 20 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. MLAల అనుచరులే ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారని సమాచారం. భారీగా ముడుపులు చెల్లించడంతో ఈసారి పందేలు ఏ స్థాయిలో జరుగుతాయోనని నిర్వాహకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.