News February 10, 2025
వికారాబాద్: స్థానిక సంస్థల స్థానాలు ఇవే..!

వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సీటుపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కన్నేశారు. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ZPTC స్థానాలు- 20, MPP- 20, MPTC- 227, గ్రామ పంచాయతీలు- 594, వార్డులు- 5,058 ఉన్నాయి. రేపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా వెలువడనుంది. అభ్యంత్రాల అనంతరం 15న కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా విడుదలవుతుంది.
Similar News
News November 26, 2025
‘ఉద్యాన రైతుల ఆదాయం పెరగాలి.. కార్యాచరణ రూపొందించండి’

AP: రాయలసీమలోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ఈ కార్యాచరణ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ కింద రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.
News November 26, 2025
రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ స్పందిస్తారా?: కేటీఆర్

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల <<18387531>>తగ్గింపు<<>>, డబ్బు దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని రాహుల్ గొప్పగా చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రూ.160 కోట్లు ఖర్చు చేశారు. తీరా చూస్తే 24 నుంచి 17 శాతానికి తగ్గించారు. దీనిపై రాహుల్ స్పందించే అవకాశం ఉందా?’ అని ట్వీట్ చేశారు.
News November 26, 2025
జీకేవీధి: సీలేరు మార్కెట్ సెంటర్లో హీరో రవితేజ సందడి

జీకేవీధి మండలం సీలేరులో ప్రముఖ సినీ హీరో రవితేజ సందడి చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు. రవితేజ, ప్రియా భవానీశంకర్ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా షూటింగ్ సీలేరులో జరుగుతోంది. మార్కెట్లోని పండ్ల దుకాణం, స్వీట్ షాప్, జోళ్ల షాప్ వద్ద పలు సన్నివేశాలు చిత్రీకరించారు.


