News February 10, 2025
వికారాబాద్: స్థానిక సంస్థల స్థానాలు ఇవే..!

వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సీటుపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కన్నేశారు. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ZPTC స్థానాలు- 20, MPP- 20, MPTC- 227, గ్రామ పంచాయతీలు- 594, వార్డులు- 5,058 ఉన్నాయి. రేపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా వెలువడనుంది. అభ్యంత్రాల అనంతరం 15న కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా విడుదలవుతుంది.
Similar News
News February 16, 2026
TU: రేపటి నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయన్నారు.
News February 16, 2026
రైల్వే జోన్ భూ వివాదంలోనూ ఆయన జోక్యం(3/3)

రైల్వే జోన్ కోసం కేటాయించిన ముడసర్లోవ సర్వే నెం.26లోని 52.22 ఎకరాలు జీవీఎంసీ భూమేనని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఇదే భూమిలో 47 మంది సాగు చేస్తున్నారని పేర్కొంటూ వారికి ఆర్‌అండ్‌ఆర్ కింద ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆ ఎమ్మెల్యే ప్రతిపాదించారట. విచారణలో అసైన్‌మెంట్ పట్టాలు లేవని తేలినా, 250 గజాల చొప్పున స్థలాల కేటాయింపు అంశం గతంలో GVMC కౌన్సిల్‌లో ఆమోదం పొందేలా చేయడం వివాదానికి సైతం దారితీసింది.
News February 16, 2026
KMR: నేడే కౌన్సిలర్ల ఎన్నిక.. ‘పుర’ పీఠం ఎవరికో?

కామారెడ్డి జిల్లాలోని పురపాలక సంఘాల్లో నేడు సందడి నెలకొననుంది. ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారంతో పాటు, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ కామారెడ్డి పరిస్థితి భిన్నంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేక మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.


