News February 18, 2025

వికారాబాద్: 1.70 లక్షల మందికి రైతు భరోసా

image

రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. వికారాబాద్ జిల్లాలో 1.70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.136,48,29,701 జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు ఎకరాల వరకు భూమికి డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,75,513 రైతులకు చెందిన 1,14,492 ఎకరాల భూమికి రూ.344,665,23,099 జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా మార్చి చివరి నాటికి అర్హులందరికీ సాయం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Similar News

News April 10, 2026

HDFC వినియోగదారులకు అలర్ట్!

image

సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.

News April 10, 2026

వరల్డ్ టాప్‌-2%లో నెల్లూరు శాస్త్రవేత్త

image

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.

News April 10, 2026

వికారాబాద్: ఈనెల 13న నేషనల్ అప్రెంటిస్ మేళా

image

ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఏటీసీ ఐటీఐలలో నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు వికారాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్రబాబు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 13న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో వివిధ కంపెనీల యజమాన్యాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఐటీఐ చేసినవారు హాజరు కావొచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9177472488ను సంప్రదించవచ్చు.