News March 21, 2025
వికారాబాద్: 10TH విద్యార్థులకు ALL THE BEST

నేటి నుంచి పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి ఆల్ ద బెస్ట్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్ఫోను అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్ సౌకర్యం కల్పించామన్నారు.
Similar News
News October 28, 2025
నల్గొండ: పిచ్చికుక్క బీభత్సం.. ఏడుగురికి గాయాలు

నల్గొండ నాలుగో వార్డు, కేశరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ పిచ్చికుక్క దాడిలో ఏడుగురు గాయపడ్డారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, రోడ్డుపై వెళ్లే బైకర్లను కూడా వెంటాడి గాయపరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ పిచ్చికుక్కను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.
News October 28, 2025
కెరమెరిలో పాము కాటుతో మహిళ మృతి

కెరమెరి మండలం సావర్ ఖేడ గ్రామానికి చెందిన మొహర్లే సంధ్య (31) పాముకాటుతో మృతి చెందింది. సోమవారం సాయంత్రం తన పత్తి పొలంలో పత్తి తీసే క్రమంలో సాయంత్రం పాముకాటు వేసింది. స్థానిక కుటుంబ సభ్యులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 28, 2025
పొట్టి కప్ అయినా పట్టేస్తారా?

ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రేపటి నుంచి 5 మ్యాచుల T20 సమరానికి సిద్ధమైంది. బుమ్రా జట్టులోకి రానుండటం ప్లస్ కానుంది. అతడి సారథ్యంలో పేస్ దళం AUSను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి. అటు యంగ్ ఇండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది.
స్క్వాడ్: సూర్య, అభిషేక్, గిల్, తిలక్, నితీశ్, దూబే, అక్షర్, జితేశ్, వరుణ్, బుమ్రా, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్, సంజూ, రింకూ, సుందర్


