News March 21, 2025
వికారాబాద్: 10TH విద్యార్థులకు ALL THE BEST

నేటి నుంచి పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి ఆల్ ద బెస్ట్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోను అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్ సౌకర్యం కల్పించామన్నారు.
Similar News
News April 22, 2025
గుంపుల- తనుగుల వంతెన పై రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

ఓదెల(M) గుంపుల, జమ్మికుంట(M) తనుగుల మధ్య ఉన్న వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. JMKT(M) వావిలాలకు చెందిన నెల్లి వంశీ(25)కి ఓదెల(M) గూడెంకు చెందిన అర్చితతో ఇటీవల వివాహమైంది. కళ్యాణ లక్ష్మి పత్రాలపై సంతకం చేసేందుకు ఉదయం గూడెం గ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో గుంపుల వంతెన పై ఎదురుగా వస్తున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. వంశీ మృతి చెందగా అర్చిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
News April 22, 2025
నాగర్‌కర్నూల్: రంపంతో భర్త గొంతు కోసిన భార్య..!

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు ఉంటున్నారు. ఈనెల 19న భార్యతో కురుమయ్య గొడవపడ్డాడు. అదేరోజు రా.11 గంటలకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో వెళ్లి రంపం బ్లేడ్ తీసుకొచ్చి కురుమయ్య గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.
News April 22, 2025
సంగారెడ్డి: నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

జిల్లాలో మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనున్నారు. జిల్లాలో మొదటి సంవత్సరంలో 17,232 మందికి గాను 16,762 మంది (96.63%), సెకండియర్‌లో 14,722 మందికి గాను 14,384 మంది (97.52%) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST