News March 26, 2025

వికారాబాద్: 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: అ.కలెక్టర్

image

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్దతు ధర వరి ఏ-రకం ధాన్యానికి రూ.2320, సన్నాలకు రూ.500 బోనస్, మామూలు రకానికి రూ.2300 మద్దతు ధర నిర్ధారించడం జరిగిందన్నారు.

Similar News

News November 13, 2025

జిల్లాలో వందే భారత్.. నరసాపురం వరకు పొడిగింపు

image

జిల్లాలో మొట్ట మొదటిగా వందే భారత్ రైలు నడవనుంది. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జనవరి 12 నుంచి నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 20677 రైలు చెన్నై నుంచి జనవరి 12న 5.30 బయలుదేరి 14.10కి నరసాపురం చేరుతుంది. తిరిగి అదే రోజు నరసాపురంలో 14.50 బయలుదేరి 23.45కు చెన్నై చేరుతుంది. జిల్లాలో ఈ రైలు భీమవరం, నరసాపురంలో ఆగుతుంది.

News November 13, 2025

భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వినియోగదారులను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. చాలా రకాల కూరగాయలు పావుకేజీ రూ.30కి తక్కువ లభించడం లేదు. అంటే కేజీ రూ.100-120 పలుకుతోంది. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్‌తో పంటలు తీవ్రంగా దెబ్బతినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీరూ కూరగాయల రేట్లతో షాక్ అయ్యారా?

News November 13, 2025

ఇతిహాసాలు క్విజ్ – 65

image

ఈరోజు ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>