News March 5, 2025
వికారాబాద్: 144 సెక్షన్ అమలు: ఎస్పీ నారాయణరెడ్డి

నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల చుట్టూ జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లు మూసివేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు.
Similar News
News March 6, 2025
సుల్తానాబాద్: హరికృష్ణ ఓటమికి ఒక్కటైన అగ్రకుల నేతలు

అగ్రకుల నేతలంతా ఏకమై బీఎస్పీ బలపరిచిన బీసీ నాయకుడు, ఉమ్మడి KNR, MDK, ADB, NZB ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఓటమిపాలు చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల రవీందర్ ఆరోపించారు. ఆయన సుల్తానాబాద్‌లో మాట్లాడుతూ.. ఒక సామాన్యుడిని ఓడించేందుకు కాంగ్రెస్, BJP అభ్యర్థులు ఒక్కటై వందలకోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమేనని ఆరోపించారు.
News March 6, 2025
న్యూలుక్లో మహేశ్‌బాబు, పృథ్వీరాజ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘SSMB29’ షూటింగ్ కోసం సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో పాటు పృథ్వీరాజ్ ఒడిశాకు బయల్దేరిన విషయం తెలిసిందే. మహేశ్ లాంగ్ హెయిర్‌తో క్యాప్ ధరించగా, క్లీన్ షేవ్‌లో మీసంతో పృథ్వీ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. అయితే, ఈ చిత్రంలో పృథ్వీ విలన్ రోల్లో నటిస్తారని వార్తలొస్తున్నాయి.
News March 6, 2025
ప్రముఖ సింగర్‌తో ఎంపీ తేజస్వీ వివాహం

బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య కర్ణాటక గాయని శివశ్రీ స్కందప్రసాద్ను పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావిడీ లేకుండా సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో MA & చెన్నై సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో MA పట్టా పొందారు. కర్ణాటకలో భరతనాట్య కళాకారిణిగా, సింగర్‌గా ప్రసిద్ధి చెందారు.