News March 5, 2025

వికారాబాద్: 144 సెక్షన్ అమలు: ఎస్పీ నారాయణరెడ్డి

image

నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల చుట్టూ జిరాక్స్, ఆన్‌లైన్ సెంటర్లు మూసివేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు.

Similar News

News February 17, 2026

అనకాపల్లి: విజయవంతంగా ముగిసిన శాప్ లీగ్ చెస్ టోర్నమెంట్

image

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి శాప్ లీగ్ చెస్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అదేశాల మేరకు నిర్వహించిన పోటీల్లో అండర్-13,15,17 విభాగాలకు చెందిన బాల బాలికలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలు ఈనెల 21నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడాభివృద్ది అధికారిణి పూజారి శైలజ తెలిపారు.

News February 17, 2026

త్వరలో హాస్టళ్లలోని 1,433 పోస్టుల భర్తీ: సవిత

image

AP: సంక్షేమ హాస్టళ్లలోని 1,433 కుక్, లేబర్, పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. ‘142 కుక్, లేబర్, 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం. కొత్తగా 10 MJP BC గురుకులాలను నెలకొల్పుతాం. 6 గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తాం. పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకోసం ₹420CR, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ₹933 CR కేటాయించాం’ అని వివరించారు.

News February 17, 2026

VZM: రైల్వే పోలీసుల ఫోన్ నంబర్లు మారాయి..

image

విజయనగరం రైల్వే పోలీసుల (GRP) ఫోన్ నంబర్లు మారాయి. టెలికాం సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి కొత్త నంబర్ల కేటాయింపు జరిగింది. అందులో భాగంగా ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ హోదాల్లో ఉన్న వారికి మాత్రమే నంబర్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా విజయనగరం రైల్వే ఎస్‌ఐ 9247585742, పలస ఎస్‌ఐ 9247585743, ఆమదాలవలస ఎస్‌ఐ 9247585744 నంబర్లలో అందుబాటులో ఉంటారు.