News March 31, 2025
వికారాబాద్: 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

పదోతరగతి అంటే ఓ మధుర జ్ఞాపకం.. జీవితంలో ఎంత ఎదిగినా సరే టెన్త్ ఫ్రెండ్స్ కలిస్తే చెప్పలేని సంతోషం..ఆ రోజుల్లో చేసిన అల్లరి గుర్తుకొస్తే ఎంతో బాగుంటుంది. VKBజిల్లా ధారూర్ మండలం నాగసమందర్ ZPHSలో 2007-2008 బ్యాచ్కు చెందిన టెన్త్ పూర్వ విద్యార్థులు 17ఏళ్ల తర్వాత సోమవారం ఒక చోట కలుసుకున్నారు.యోగ క్షేమాలు తెలుసుకుని, నాటి గురువులను సన్మానించారు. మరి మీరు మీ టెన్త్ ఫ్రెండ్స్ను కలిశారా?కామెంట్ చేయండి.
Similar News
News September 18, 2025
కొత్తగూడెం- భద్రాచలం మధ్య ఎయిర్పోర్టుకు స్థలాలు..?

కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈసారి భద్రాచలం- కొత్తగూడెం మధ్య ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు ప్రభుత్వం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రెండు, మూడుచోట్ల స్థలాలను గుర్తించగా, వాటిలోఒకటి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<