News February 18, 2025

వికారాబాద్: 19న శివాజీ శోభాయాత్ర: హిందూ ఉత్సవ సమితి

image

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈనెల 19న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి వీర హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హిందూ ఉత్సవసమితి తెలిపింది. రాజకీయాలకతీతంగా దేశభక్తులు అందరూ ఈ కార్యక్రమంలోపాల్గొని కోరారు. పట్టణం మొత్తం ఇప్పటికే కాషాయముగా మారిందని, శివాజీ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి బడిబాటి పిల్లల సర్వే

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు బడిబాట పిల్లల సర్వే నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. సీఆర్పిలు, ఐఈఆర్పీలు DLM T తమ ప్రాంతాల పరిధిలో బడిబాట పిల్లల సర్వేలు నిర్వహించాలని సూచించారు. బర్త్ డే పిల్లల వివరాలను ప్రబంధ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు.

News November 19, 2025

సంగారెడ్డి: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: ఎస్పీ

image

పోలీస్ సిబ్బందికి పంపిణీ చేసే గ్యాస్ ఆటోను ఎస్పీ పారితోష్ పంకజ్ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసు సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్యాస్ ఆటో ద్వారా త్వరగా సిలిండర్ అందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

News November 19, 2025

చరిత్ర లిఖించిన అతిచిన్న దేశం.. FIFA వరల్డ్ కప్‌కు అర్హత!

image

కరీబియన్ దీవి దేశమైన కురాకో FIFA ప్రపంచ కప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం 1.56 లక్షల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశంగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఐస్‌లాండ్ పేరిట ఉన్న రికార్డును ఇది బద్దలు కొట్టింది. జమైకాతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 0-0తో డ్రా చేసుకొని 2026 WCలో స్థానం సాధించింది. అర్హత సాధించడంతో ప్లేయర్లు ఎమోషనలయ్యారు.