News February 18, 2025
వికారాబాద్: 19న శివాజీ శోభాయాత్ర: హిందూ ఉత్సవ సమితి

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈనెల 19న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి వీర హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హిందూ ఉత్సవసమితి తెలిపింది. రాజకీయాలకతీతంగా దేశభక్తులు అందరూ ఈ కార్యక్రమంలోపాల్గొని కోరారు. పట్టణం మొత్తం ఇప్పటికే కాషాయముగా మారిందని, శివాజీ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
ఎర్రగుంట్ల: మోసాల్లో ఇదో కొత్త రకం

బంధువని చెప్పి మాటల్లో పెట్టి మోసంచేసే కేటుగాడిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేటకు చెందిన ఖాసీంపీరా చెడు వ్యసనాలకు బానిసై అప్పులుచేసి, అవి తీర్చడానికి అడ్డదారులు ఎంచుకున్నాడు. ఈనెల 9న ఎర్రగుంట్లలో మహబూబీ అనే వృద్ధురాలిని బంధువని నమ్మించాడు. ‘తన కూతురి పెళ్లికి రావాలని, మీ చేతికి ఉన్న ఉంగరం లాంటిది చేయిస్తానని చెప్పి, ఇవ్వాలని తీసుకొని’ ఉడాయించాడు.
News March 24, 2025
HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 24, 2025
అనకాపల్లి: ఇంటర్ కాలేజీలకు హెచ్చరిక

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ చేపడితే చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా ఇంటర్ విద్యాధికారిణి బి. సుజాత హెచ్చరించారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాల ప్రకటన జారీచేసిన తర్వాతే షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి ఏడాది అడ్మిషన్లు చేపట్టాలన్నారు. ఎలాంటి ముందస్తు అడ్మిషన్లు చేపట్టరాదన్నారు.