News March 24, 2025
వికారాబాద్: 26న 148 వాహనాల వేలం

వికారాబాద్ జిల్లాలో ఈనెల 26న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గుర్తుతెలియని 148 వాహనాలకు వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాలలో ఏదైనా వాహనంపై ఎవరికైనా అభ్యంతరం, యాజమాన్య హక్కులు లేదా ఆసక్తి ఉంటే వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. SHARE IT.
Similar News
News November 28, 2025
HYD: మెగా కార్పోరేషన్‌గా జీహెచ్ఎంసీ

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్‌గా అవతరించింది. కాగా కార్పోరేషన్‌ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందని టాక్.
News November 28, 2025
గొలుగొండ: షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టిన భర్త.. భార్య సూసైడ్

మండలంలోని కొంగసింగిలో వివాహిత అరిటా లక్ష్మీపార్వతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. మృతురాలి భర్త ప్రసాద్ నేవీ ఉద్యోగిగా పని చేసి రిటైరయ్యాడు. అనంతరం వచ్చిన రూ.20 లక్షలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మొత్తం డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరి మధ్యగొడవ జరింది. అనంతరం తన గదిలోకి వెళ్లిన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది.
News November 28, 2025
గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే: జేసీ

మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యం.వెంకటేశ్వర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, కుల వివక్షత నిర్మూలనకై పోరాడారన్నారు.


