News March 24, 2025

వికారాబాద్: 26న 148 వాహనాల వేలం

image

వికారాబాద్ జిల్లాలో ఈనెల 26న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గుర్తుతెలియని 148 వాహనాలకు వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాలలో ఏదైనా వాహనంపై ఎవరికైనా అభ్యంతరం, యాజమాన్య హక్కులు లేదా ఆసక్తి ఉంటే వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. SHARE IT.

Similar News

News April 24, 2025

జగిత్యాల: రేపు పోషణ మాసం ముగింపు ఉత్సవాలు

image

జగిత్యాల జిల్లాలో పోషణ మాస ముగింపు ఉత్సవాలను శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరేశ్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉ.11గం.లకు పోషణ మాసం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారని, కావున మహిళలు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News April 24, 2025

ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ కీలక ప్రకటన

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పరిధిలో కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇందులో డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ టీమ్స్ పాల్గొన్నాయని వెల్లడించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోల సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

News April 24, 2025

ఇది మీ స్థాయి.. ఇక్కడ కూడా కాపీనేనా?

image

ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌పై భారత్ నిన్న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ సైతం అదే దారిలో నడిచింది. వీసాల రద్దు, హైకమిషన్ కార్యాలయంలో దౌత్య సిబ్బంది తగ్గింపు, అట్టారీ వాఘా బోర్డర్ మూసివేత, వాణిజ్య కార్యకలాపాల రద్దు ఇలా ప్రతి దాంట్లోనూ మనల్నే కాపీ కొట్టింది. ఇక 1972లో కుదిరిన షిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

error: Content is protected !!