News February 23, 2025
వికారాబాద్: 365 నీటిదార వచ్చే బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఇదే.!

వికారాబాద్ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని శ్రీబుగ్గ రామలింగేశ్వర ఆలయంలో సంవత్సరం పొడవున 24గంటల పాటు నంది నోట్లో నుంచి నీటి దారా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ లేని విధంగా 365 రోజులు 24 గంటలు ఈ నీటిదార ప్రవహించడం విశేషం. ఎండాకాలంలో సైతం ఏనాడు నీటి దార ఆగకుండా ఎంతో కొంత నీటి దార వస్తు నిరంతరాయంగా నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికీ ఈ నీరు ఎక్కడి నుండచి వస్తుందో అక్కడి ప్రజలకు కూడా తెలియదు.
Similar News
News October 14, 2025
కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వట్లేదు: BCCI VP

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారని, ఆస్ట్రేలియా సిరీసే చివరిదని జరుగుతున్న ప్రచారాన్ని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. ‘రోహిత్, కోహ్లీ ప్రజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాను ఓడించడంలో వారు కీలకం. రిటైర్మెంట్ ప్లేయర్ల ఇష్టం. కానీ ఇది వారి చివరి సిరీస్ మాత్రం కాదు. అలాంటి ఆలోచన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.
News October 14, 2025
స్నేహితుడిని రాయితో కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్

గుంతకల్లు 2 టౌన్ PS పరిధిలో స్నేహితుడు ఆనంద్(30) హత్య కేసులో నిందితుడు సయ్యద్ సలీంను (తిలక్ నగర్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న తెల్లవారుజామున బస్టాండ్లో మద్యం తాగుతున్న సమయంలో సలీం కుటుంబాన్ని ఆనంద్ దుర్భాషలాడటంతో ఆగ్రహించిన సలీం.. ఆనంద్ను రాయితో తలపై కొట్టి హత్య చేసీనట్లు టూ టౌన్ ఇన్ఛార్జ్ సీఐ మనోహర్ వెల్లడించారు. సలీంను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.
News October 14, 2025
లండన్ పర్యటనలో స్పీకర్ అయ్యన్న

ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం లండన్లోని యూకే పార్లమెంట్ను సందర్శించారు. అక్కడ పెద్దల సభ, సామాన్యుల సభ ఉపసభాపతులతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో కమిటీలు ఎలా పనిచేస్తాయి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి మాట్లాడారు. యూకే పార్లమెంట్లో కమిటీ వ్యవస్థ పనితీరును, దానిని మరింత సమర్థవంతంగా మార్చే మార్గాలను తెలుసుకున్నారు.