News April 13, 2025
వికారాబాద్: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News November 23, 2025
బాపట్ల: 108 వాహనాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బాపట్ల జిల్లా 108 వాహనాల్లో పైలట్ పోస్ట్‌లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ పి.బాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పైలట్ పోస్ట్‌కు 10th పాస్, హెవీ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ , బ్యాడ్జ్ అర్హతలు కలిగి ఉండాలన్నారు. అర్హులైన వారు నవంబర్ 24వ తేది(సోమవారం) సాయంత్రం లోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News November 23, 2025
అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్‌గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్‌తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.
News November 23, 2025
KMR: పెళ్లిరోజునే కాంగ్రెస్ అరుదైన గిఫ్ట్

నిజాంసాగర్‌కు చెందిన మల్లికార్జున్ ఆలే కామారెడ్డి DCC అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన రాజకీయ ప్రస్థానం 2000 స.లో కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. మొదట నిజాంసాగర్ NSUI అధ్యక్షుడిగా ఆ తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, మండల వైస్ MPPగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నిబద్ధతకు గుర్తింపుగా జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే శుభవార్త రావడం విశేషం.


