News April 12, 2025
వికారాబాద్: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం స్కీం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు వికారాబాద్ జిల్లాలో సుమారుగా 12 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 14 వరకు అవకాశం ఉంది. RYV మంచి అవకాశమని, దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు.
Similar News
News April 19, 2025
బొత్స వ్యూహాలు ఫలించేనా

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్‌లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?

VJA: లాయర్ల మధ్య వివాదం

విజయవాడ కోర్టులో ఇద్దరు మహిళా న్యాయవాదుల గొడవ పడిన ఘటన చోటు చేసుకుంది. జూనియర్ లాయర్ మనిప్రియ మాట్లాడుతూ.. సీనియర్ లాయర్లు సౌందర్య, పిట్టల శ్రీనివాస్ కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని నిరసన తెలిపారు. సౌందర్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనిప్రియపై 307 కేసు ఉందని, ఆమె జడ్జి ఎదుట అసభ్యంగా మాట్లాడి, బట్టలు చింపుకొని గొడవ చేసిందన్నారు. దీనిపై బార్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.