News March 9, 2025
విగ్రహ ప్రతిష్ఠాపనలో గద్వాల ఎమ్మెల్యే

గట్టు మండలం ఇందువాసిలో ఆదివారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ దేవతగా వెలుగొందుతున్న ఇంజమ్మ నూతన ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే వేడుకున్నారు. జమ్ములమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్ వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2026
NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో NOV 2025లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ వొకేషన్ 3వ సెమిస్టర్, AUG 2025లో నిర్వహించిన డిప్లొమా ఇన్ మ్యూజిక్(వోకల్) రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ANU అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
News February 13, 2026
గచ్చిబౌలిలో నోట్ల కట్టలతో పారిపోయాడు!

గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ జరిగింది. గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ వాహన డ్రైవర్ అజిత్ అలియాస్ శివ రూ.57 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. కస్టోడియన్లు బ్యాంక్‌లో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయం చూసి చోరీ చేశాడు. వాహనాన్ని తెల్లాపూర్ వద్ద వదిలేసి నగదుతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.