News May 21, 2024
విచారణకు నేను సిద్ధం: లావు కృష్ణదేవరాయలు
పల్నాడులో అల్లర్లకు తానే కారణమని YCP నేతలు ఆరోపిస్తున్నారని నరసరావుపేట MP అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మండిపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ముకేశ్ కుమార్‌కు ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎస్పీ బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి బంధుత్వం ఉందని కట్టుకథలు అల్లుతున్నారని పేర్కొన్నారు. తన కాల్ డేటా పరిశీలించాలని, విచారణకు సిద్ధమని ప్రకటించారు.
Similar News
News December 11, 2024
అమరావతికి వెళ్లిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు నాగలక్ష్మీ, అరుణ్ బాబు, వెంటక మురళి అమరావతి వెళ్లారు. నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.
News December 11, 2024
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అంబటి రాంబాబు
కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. పలువురు రైతులతో ధాన్యం కొనుగోలు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరలు లేవని, తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోవాల్సి వస్తుందని అంబటి విమర్శించారు.
News December 10, 2024
వైసీపీ రైతు ఉద్యమం పోస్టర్ విష్కరణ
ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితర నేతలు పిలుపునిచ్చారు.