News February 23, 2025
విచారణను వేగవంతం చేయాలి: లక్ష్మీ నరసింహరావు

బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ ఛైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహ రావు అన్నారు. శనివారం ఘనపురంలో మీడియాతో మాట్లాడారు. రాజలింగమూర్తి హత్య విషయంలో రాజకీయ రాద్దాంతం చేయడం సరికాదని, హత్యకు కారకులైన వారిని పట్టుకొని శిక్షించాలని, విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 25, 2025
ఉద్యోగులు, పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్!

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది. ఏప్రిల్ ఆరంభంలో షరతులు, నిబంధనలను క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుందని సమాచారం. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్‌తో కమిషన్ పని ఆరంభిస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు, DoPT నుంచి సూచనలు వచ్చాయి. కమిషన్ ఏర్పాటయ్యాక వీటిని సమీక్షిస్తుంది. దీంతో 50లక్షలకు పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రయోజనం దక్కుతుంది.
News March 25, 2025
కలెక్టర్ల సమావేశంలో మంత్రి సంధ్యరాణి

CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలోని సచివాలయంలో 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రివర్గంతో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
News March 25, 2025
రేపు భైంసాలో ఎస్పీ ఫిర్యాదుల విభాగం

పోలీసులు మీకోసంలో భాగంగా బుధవారం భైంసా క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఫిర్యాదుల విభాగం నిర్వహించనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భైంసా సబ్ డివిజన్లో ఉన్న ఫిర్యాదుదారులు నేరుగా ఆమెను కలిసి ఫిర్యాదులు అందజేయవచన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.