News August 29, 2024

విచారణ కోసం మహిళా అధికారిని నియమించాం: హోంమంత్రి అనిత

image

ముంబై నటి జత్వాని కేసుపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. బాధితురాలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు. విచారణ కోసం మహిళా అధికారిని నియమించినట్లు మంత్రి ప్రకటించారు. తప్పుచేస్తే అధికారులతో సహా ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. దిశ పీఎస్‌లను మహిళా పీఎస్‌లుగా వినియోగిస్తామన్నారు.

Similar News

News September 8, 2024

విశాఖ: ‘ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య’

image

ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్.ఎన్ రాజు అన్నారు. ఈనెల 12న ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పీఏపీ కార్యదర్శి కామేశ్వరరావు అధ్యక్షతన ఆత్మహత్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడే గుర్తించే అవకాశం యువతకు, కుటుంబ సభ్యులకు ఉంటుందని వెంటనే వారిని కాపాడాలని కోరారు.

News September 8, 2024

విశాఖ జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు

image

ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఎం.ఎన్. హారేంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో ఎల్.చంద్రకళ తెలిపారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కాగా.. ఇప్పటికే అల్లూరి జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

News September 7, 2024

విశాఖ: ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్న నేపథ్యంలో ఏటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శ్రీ పృథ్వీతేజ్ ఇమ్మడి సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.