News July 16, 2024

విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తాం: అడిషనల్ ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను అడిషనల్ ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చట్ట పరిధిలో విచారణ జరిపి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News October 11, 2024

మార్కాపురం: డ్రైనేజీలో పసికందు

image

మార్కాపురంలో మానవత్వం మంట కలిసింది. పట్టణంలోని కంభం సెంటర్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో అప్పుడే పుట్టిన శిశువును డ్రైనేజీ కాలవలు శుభ్రం చేస్తుండగా కాలువలో మున్సిపల్ కార్మికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత పసికందును పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో కాలువలో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 11, 2024

సింగరాయకొండ: ‘నా బిడ్డ చావుకు నా భర్తే కారణం’

image

సింగరాయకొండ డ్రైవర్ పేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సీఐ హజరత్తయ్య వివరాల ప్రకారం.. సందాని, రషీదా దంపతులకు రెండో సంతానంలోనూ ఆడపిల్ల ఏడో నెలలో అనారోగ్యంతో పుట్టింది. తన భర్త సరైన వైద్యం చేయించకపోవడంతో బిడ్డ చనిపోయిందని తల్లి రషీదా ఆరోపించింది. దీంతో భర్త సందాని, అత్త మామలే చిన్నారి మరణానికి కారణమని సింగరాయకొండ పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News October 11, 2024

ప్రకాశం: మద్యం దరఖాస్తులు అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ

image

ప్రకాశం జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అధికార వెబ్‌సైట్ ప్రకారం.. కనిగిరి రూరల్‌లోని షాప్ నంబర్ 123కు అత్యల్పంగా 4 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా చీమకుర్తి రూరల్‌లోని షాప్ నంబర్ 58కి 43మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ షాపునకు రూ.కోటీ 16 లక్షలు ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇవాళ చివరి రోజు కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.