News September 23, 2024
విజన్-2047 ప్లాన్‌పై అభిప్రాయాలను అందించండి: కలెక్టర్

స్వర్ణాంధ్ర విజన్-2047 ప్లాన్‌పై ప్రభుత్వానికి సూచనలు, అభిప్రాయాలను అందజేయాలని కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ నుంచి http://swarnandhra.ap.gov.in/Suggestions. లింక్‌తో వచ్చే QR కోడ్ ద్వారా పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు సంతకంతో కూడిన సర్టిఫికేట్‌ను స్వీకరించాలన్నారు. QR కోడ్‌ని స్కాన్ చేసే సలహాలు అందించాలని చెప్పారు.
Similar News
News January 9, 2026
పది విద్యార్థులు ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్: గుంటూరు కలెక్టర్

పదో తరగతి విద్యార్థులు అందరూ ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్ అవుతారని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రోత్సహించారు. SC, ST, BC, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల కోసం నిర్వహించిన విజయం మనదే కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. లక్ష్యాలను పెట్టుకుని వాటి విజయానికి కృషి చేయాలని సూచించారు. పరీక్షలపై భయం లేకుండా పాజిటివ్ మైండ్‌సెట్‌తో చదవాలని తెలిపారు. విద్యార్థులకు విజయం మనదే స్టడీ మెటీరియల్ ఇచ్చారు.
News January 9, 2026
తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.
News January 8, 2026
GNT: కనీసం డైరెక్టర్ పదవులైనా స్థానికులకు కేటాయిస్తారా?

గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌గా పల్నాడు జిల్లాకు చెందిన కుర్రా అప్పారావు నియామకంపై స్థానిక క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన అర్హులను పక్కనపెట్టి ఇతర జిల్లా నేతకు పదవి అప్పగించడంపై కూటమి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది స్థానిక క్యాడర్‌కు అన్యాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. కనీసం డైరెక్టర్ పదవులైనా స్థానికులకు కేటాయిస్తారా? అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది.


