News October 12, 2024

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక: మంత్రి పొన్నం

image

రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయదశమి జరుపుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆ దుర్గాభవాని అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆయుఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ పెద్దల ఆశీర్వాదం తీసుకొని భవిష్యత్తులో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

Similar News

News November 11, 2024

రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి పొన్నం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం రాత్రి 11:55గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్‌పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈరోజు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.

News November 10, 2024

మెట్‌పల్లి ఎమ్మెల్యేగా జ్యోతి నియంతృత్వ పాలనను ఎదిరించారు: MLC

image

మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నియంతృత్వ పాలనను ఎదురించడంలో ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి తమతో పాటు ఎమ్మెల్యేగా జ్యోతి ముందు వరుసలో ఉండేదని జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. శాసనసభలోనే కాకుండా అన్ని రంగాలలో మహిళల హక్కుల కోసం జ్యోతి పోరాటం చేసారన్నారు.

News November 10, 2024

సీఎం, మంత్రి వెంకట్ రెడ్డిపై కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

image

జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లను దూషించిన సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.