News August 9, 2024

విజయనగరంలో అంగన్వాడీలపై కేసు కొట్టివేత

image

2017 టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నేతలపై పెట్టిన కేసులను మొబైల్ కోర్టు తాజాగా కొట్టి వేసింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని 2017 సెప్టెంబర్ నెలలో కలెక్టరేట్ వద్ద సీఐటీయూ నేతలతో కలిసి అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా ధర్నా చేపట్టారని అంగన్వాడీ, సీఐటీయూ నేతలపై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల విచారణ అనంతరం కేసు సరైంది కాదని కోర్టు కొట్టివేసింది.

Similar News

News September 16, 2024

విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే

image

విశాఖ నుంచి దుర్గ్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.

News September 16, 2024

సాలూరు వస్తుండగా బైక్ దగ్ధం

image

ఆనందపురం ఫ్లైఓవర్ వంతెన వద్ద సోమవారం పల్సర్ బైక్ దగ్ధం అయింది. నవీన్ అనే యువకుడు విశాఖ నుంచి సాలూరు బైక్‌పై వెళుతుండగా ఫ్లైఓవర్ వంతెన వద్ద ఆకస్మికంగా బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన నవీన్ బైక్ నిలిపివేశాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.

News September 16, 2024

ఎస్.కోట: మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం

image

ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామంలో ఓ వృద్ధుడు ఆదివారం సజీవదహనమయ్యాడు. రాత్రి వినాయక నిమజ్జనంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంట నాగు(74) మద్యం తాగి సిగరెట్ వెలిగించాడు. ఈ క్రమంలో సిగరెట్ నిప్పు అంటుకోవడంతో మంచంతో పాటు ఆయన సజీవ దహనమయ్యాడు. ఇంట్లో ఉన్న భార్య కేకలు వేసినా ఫలితం లేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.