News August 17, 2024

విజయనగరంలో అన్న క్యాంటీన్లపై మీ కామెంట్..!

image

విజయనగరం జిల్లాలో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో రెండు చోట్ల క్యాంటీన్లను ఓపెన్ చేశారు. మరికొద్ది రోజుల్లో మన్యం జిల్లాలోనూ ప్రారంభించనున్నారు. తొలిరోజు విజయనగరంలో క్యాంటీన్ల వద్ద రద్దీ కనపడింది. ఇంతకీ ఈ క్యాంటీన్లలో మీరు భోజనం చేశారా? రుచి ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగపడే ప్రాంతాల్లో క్యాంటీన్లు పెట్టారా? ఇంకా ఎక్కడెక్కడ క్యాంటీన్లు పెట్టాలి? అనేది మీరు కామెంట్ చేయండి.

Similar News

News December 12, 2025

జనవరి 23 నుంచి విశాఖలో బీచ్ ఫెస్టివల్

image

జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిపి విశాఖ ఉత్సవ్‌పై కమిటీ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తామన్నారు.

News December 12, 2025

VZM: ‘హెల్త్ కవరేజ్‌లో ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి’

image

పుష్పగిరి కంటి ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు సీనియర్ సివిల్ జడ్జి & డీఎల్ఎస్ఎ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీలో ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలు కూడా అందరికీ అందిస్తామన్నారు.

News December 12, 2025

24న జాతీయ వినియోగదారుల దినోత్సవం: VZM JC

image

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈనెల 24న నిర్వహించాలని విజయనగరం జేసీ ఎస్.సేథు మాధవన్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ నుంచి వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈసారి ‘డిజిటల్ న్యాయపాలన, సమర్థ సత్వర పరిష్కారం’ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిషులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు.