News July 8, 2024
విజయనగరంలో ఈ నెల 11న జాబ్మేళా: అరుణ

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా, వివిధ ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 270 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 11న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అరుణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వివరాలను ముందుగా employment.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 11న ఉదయం 10 గంటలకు విజయనగరం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకి హాజరుకావాలన్నారు.
Similar News
News September 15, 2025
విజయనగరం ఎస్పీ కార్యాలయానికి 32 ఫిర్యాదులు

ఫిర్యాదు చేసిన బాధితుల సమస్యలను పోలీసు అధికారులు చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్య లత అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి 7 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News September 15, 2025
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపాలని జిల్లా SP ఏఆర్ దామోదర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన సోమవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను వివరించి, నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్ల పరిధిలో ప్రధాన నేరాలు, శాంతి భద్రతల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
News September 15, 2025
VZM: నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.